CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగుదారుల రిలే నిరాహార దీక్ష..

Share it:


 మద్దతు తెలిపిన నాయకులు..



 మన్యం టీవీ, అశ్వరావుపేట:పోడు భూముల కోసం గిరిజనులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని, ప్రభుత్వాలు స్పందించి పోడు సాగు దారులకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దీక్షలు చేపట్టారు. అశ్వరావుపేట మండలంలోని, మల్లాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పండు వారి గూడెం గ్రామ ప్రజలు ఫారెస్ట్ అధికారుల మధ్య పరస్పర వాదోపవాదాలు, గిరిజనులపై దాడులు జరిగిన నేపథ్యంలో బుధవారం పండువారిగూడెం సరిహద్దు ప్రాంతంలో టెంట్ వేసుకుని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వందల మంది పోడు సాగుదారుల తో దీక్షా శిబిరం కళకళలాడింది. దీక్షా శిబిరానికి మద్దతుగా అనేకమంది విచ్చేసి సంఘీభావం ప్రకటన చేశారు. స్థానిక సర్పంచ్ నారం రాజశేఖర్ పూర్తిస్థాయి మద్దతు తెలిపి, పోడు సాగు దారులకు పట్టాలు ఇచ్చేవరకు మీ పోరాటంలో నా వంతు భాగ స్వామ్యాన్ని ఉంటుందని, వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పోడు సాగుదారులు మాట్లాడుతూ, కనీసం అక్షర జ్ఞానం లేనటువంటి మాకు, ఉన్నత విలువలు చదువుకున్న అటువంటి ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేసి అమానుషంగా విచక్షణారహితంగా మాపై దాడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తక్షణమే ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. ఫారెస్ట్ అధికారులను సన్పెండ్ చేసేంతవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉంటామని, వారన్నారు. తాత ముత్తాతల నుండి ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి భూములను అత్యాశతో ఉన్నత అధికారుల మెప్పు కోసం మమ్మల్ని బలిపశువులు చేయటం సరైన విధానం కాదని అటువంటి, వారు. మా పట్ల క్రూరత్వం గా ప్రవర్తించడం సరైన విధానం కాదని తక్షణమే అధికారులు ఆలోచన చేసుకుని మాపై, కక్ష సాధింపులు విరమించుకోవాలని అధికారులు కోరుతున్నామని అన్నారు. రానున్న రోజులలో మరింత వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా మన్నారు. దీక్షా శిబిరంలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. హాజరై స్థానికులకు అండగా భరోసానిచ్చారు. ప్రభుత్వ పెద్దల తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఫారెస్ట్ అధికారు లు అమాయక ఉన్నటువంటి గిరిజనులపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని ఎన్నిసార్లు వారికి విన్నవించిన వారు, చలనం, లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. దీక్షా శిబిరం నుండి స్థానిక సీఐతో ఫోన్ లో మాట్లాడారు. కాగా గాయాలైన వారిని ఆస్పత్రికి చేర్చాలని స్థానిక సర్పంచ్ ఆదేశించారు. వారికి ఆస్పత్రిలో అయ్యే ఖర్చును నేనే భరిస్తా అని వారికి హామీ ఇచ్చారు. మరో ముఖ్య నేత జారి ఆదినారాయణ హాజ రయ్యారు. కెసిఆర్ పోడు సాగు దారులకు పట్టాలు ఇస్తారని గతంలో అనేక మార్లు హామీ ఇచ్చారని, ఫారెస్ట్ అధికారులు అవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యం గా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని గిరిపుత్రులపై ఇంతటి దాష్టీకాన్ని ప్రదర్శించటం మంచి పద్ధతి కాదని వారన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను జటిలం అవ్వకుండా పరిష్కరించేం దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి హాజరై, అధికారుల తీరు సరిగా లేదని ఎన్నిసార్లు, పోడు, సాగు దారులకు జోలికి వెళ్లవద్దని చెప్పినప్పు టికీ అధికారులు ఖాతరు చేయకపోవడం దురదృష్టకరమని, అందరం కలిసి ఉన్నతాది కారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారన్నారు. నారాయణపురం రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు చిన్నం శెట్టి వెంకట నరసింహం, హాజరై సంఘీభావం ప్రకటించారు. మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు పాయం దుర్గారావు హాజరై దాడి చేయటం దుర్మార్గమని, ఫారెస్ట్ అధికారులపై ఉన్నతాధి కారులు జోక్యం చేసుకొని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తుందని, ఇలాంటి అధికారుల అత్యుత్సాహం వల్లనే గొడవలకు దారి తీస్తున్నాయని , తక్షణమే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చిరంజీవి నాయుడు, పిట్టల అర్జున్, టీఆర్ఎస్ నాయకులు, బాబు, రామకృష్ణంరాజు, మాజీ ఎంపీపీ బరగడ కృష్ణ, మాజీ జెడ్పిటిసి అంకత మల్లికార్జునరావు, లైన్స్ క్లబ్ అధ్యక్షులు, కంచర్లల భాస్కర్ రావు తదితరులున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: