CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆలోచించి ఓటు వేయండి

Share it:

 


*ములుగు ఎమ్మెల్యే సీతక్క

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లకు దిశ నిర్దేశించిన సీతక్క.

అన్ని మండలాల యూత్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం.

మన్యంటీవీ ఏటూరునాగారం:


జిల్లాలోని అందరూ పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ,( సీతక్క )అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో ములుగు జిల్లా లోని అన్ని మండలాల యూత్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మీరు, మీరు పట్టభద్రులు, నిరక్షరాస్యులు కారు అని, అందరూ ఉన్నత విద్యను అభ్యసించి ఆలోచించే జ్ఞాన ఉన్నవారిని మీకు నేనేం ఎక్కువ చెప్పలేను అని, మీరే ఆలోచించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు వేయాలని యువతకు దిశా నిర్దేశం చేశారు. గతంలో  కాంగ్రెస్ పార్టీ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, రైతులకు కు  ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టింది, విద్యార్థులకు, కూలీలకు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో.... ఇప్పుడున్న కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి ఏం చేసాయో, మీకు అన్ని విషయాలు తెలుసు అని ఆమె తెలిపారు. బాగా ఆలోచించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. చదువుకున్న విద్యావంతులైన మీరు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ప్రలోభాలకు గురి చేసిన గురికావద్దని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడారంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల బాగోగులు తెలుసుకున్నారు. వారి యొక్క భోజన సౌకర్యాలను ఆహార పదార్థాలను చూసి పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల కరోనా దృష్టా అతి జాగ్రత్తగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు ఎవరైనా గతంలో కొవిడ్ పాజిటివ్ వారు ఉన్నారా అని ఆరా తీశారు. విద్యార్థినిల పట్ల అజాగ్రత్తగా ఉండరాదని సమయపాలన పాటించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి,తాడ్వాయి మండల అధ్యక్షుడు అనంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్రకోళ తిరుపతి, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు చెర్ప రవీందర్, యూత్ అధ్యక్షులు బానోతు రవి చందర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, కన్నాయిగూడెం జడ్పిటిసి కరంచంద్ గాంధీ, ఏటూరునాగారం మండల అధ్యక్షులు చిటపట రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు అప్సర్ పాషా, ములుగు మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, మంగపేట మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు యానయ్య, భగవాన్ రెడ్డి, రాజిరెడ్డి, మావూరు తిరుపతిరెడ్డి డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, మైనార్టీ సెల్ అజ్జు, అశోక్, రేవంత్,  భరత్, చందు, ఇస్సార్ ఖాన్, గణేశ్, రమణా కర్, నేపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: