CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిపుత్రుల పోడుగోస..

Share it:

 


 ఇరువర్గాల ఘర్షణ..

 స్వల్ప గాయాలు..

 వాదోపవాదాలు..

 

  మన్యంటీవీ,అశ్వారావుపేట:

పోడు సాగు దారులకు, గిరిజనుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇరువురికి స్వల్పగాయాలయ్యాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు. అశ్వరావుపేట మండలంలోని, మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి, పండు వారి గూడెం గ్రామ ప్రజలు, ఫారెస్ట్ అధికారుల మధ్య, మంగళవారం పాలవాగు పరిసర ప్రాంతాలలో, పోడు భూముల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోడు సాగు దారులు, మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పోడు భూమినీ నమ్ముకొని జీవనం బతుకు పోరాటాన్ని కొనసాగిస్తామని, అలాంటి భూమిని బలవంతంగా ఫారెస్ట్ అధికారులు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని వారు వాపోయారు. మా భూములను బలవంతంగా లాక్కుంటే ఆత్మహత్యలు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. మా భూములను కాపాడుకునే ప్రయత్నంలో అడ్డం గా నిలబడడం జరిగిందని, ఈ సందర్భంలో ఫారెస్ట్ అధికారులు మాపై జులుం, చేసి మమ్మల్ని కొట్టి హింసించారు, అని వారన్నారు. కనీసం నిలువ నీడ లేక పొట్ట చేత పట్టుకొని బతుకుజీవుడా అంటూ ఉన్నటువంటి మా గిరిజనుల పై ప్రభుత్వ అధికారులు ఇంత కక్ష సాధింపు చర్యలు తీసుకోవటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వం ఒకపక్క పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెబుతూనే, మాపై పంపడం ఎంతవరకు ధర్మమని వారు తమ గోడును వెలిబుచ్చారు. అనేక మంది గాయాలపాలయ్యారు అని ఫారెస్ట్ అధికారులు పై దాడులను విరమించుకోవాలని, అని వారన్నారు. శాంతియుత వాతావరణం లో రోజువారీగా మా భూములకు ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపే వరకు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తామని, తెలిపారు. రానున్న రోజులలో మా భూముల పై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు, సమాచారం, వ్యక్తమవుతోందని, తప్పనిసరిగా అన్ని కుల సంఘాలను రాజకీయ నాయకుల మద్దతును పెద్ద ఎత్తున, మద్దతు కోరుతూ, ఆందోళనకు సిద్ధం అవుతామని, వారు తెలిపారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని, భూములను ఇచ్చే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు. గతంలో సైతం మా దగ్గర ఉన్నటువంటి భూములను లాక్కోవడం జరిగిందని ఈసారి కచ్చితంగా మా భూములను వదిలే ప్రసక్తే లేదని వారన్నారు. మేము తెలిసీ తెలియక అమాయక గూడలో బతుకు తుంటే వారు, అధికార దర్పాన్ని మాపై ప్రదర్శిస్తే, కుటుంబం మొత్తం ఆత్మహత్య కూడా వెనకాడబోమని, అన్నారు. ప్రభుత్వాలు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. అనేకమంది ఫారెస్ట్ దాడుల పట్ల గాయాలపాలయ్యారు అని అయినప్పటికీ భయపడేది లేదని వారన్నారు. అందరి సహాయ సహకారాలతో ముందు ముందు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇదే విషయంపై రేంజర్ ను నినాదం వివరణ కోరగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు భూములను తీసుకోవడం జరుగుతుంద ని, 2005 , కంట్టే ముందు, పోడు సాగు, చేసుకొని బతుకుతుంటే వారి జోలికి వెళ్లడం లేదని, పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం లోనే భూములను వెనక్కి తీసుకుంటున్నామని పరిస్థితుల్లో ప్రజలంతా అర్థం చేసుకొని సహకరించాలని, మా పై అధికారులు, ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని అన్నారు. మా ఫారెస్ట్ అధికారులకు సైతం గాయాలయ్యాయని, ప్రజలు సమన్యాయం పాటించాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: