CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిర్చి రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించండి....

Share it:

 



 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళ సై అకినేపల్లి మల్లారం వచ్చే అవకాశం...?


 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి

మన్యం టీవీ మంగపేట.

సుగంధ పంటలను సాగు చేసే రైతులకు ఆయా పంటలలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు ఆర్ పి ఎల్ రైతు శిక్షణ కార్యక్రమాలకు నిధులు కేటాయించి వీలైనంత త్వరగా రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి  స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాది. లింగప్ప ను కోరారు. శుక్రవారం ఆయన  డి. డి. లింగప్ప తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ, ఆర్ పి ఎల్  రైతు శిక్షణ కార్యక్రమాలు త్వరగా మంజూరు అవుతే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ములుగు జిల్లా అకినేపల్లి మల్లారం గ్రామానికి వచ్చే అవకాశం ఉందన్నారు. స్థానిక ఎంపీ కవిత, శాసనసభ్యులు సీతక్క, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొంటారన్నారు. అదేవిధంగా సర్టిఫికెట్ల పంపిణీ  కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సాంబశివ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా  స్పైసెస్ బోర్డు డి డి లింగప్ప మాట్లాడుతూ,  కేరళలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున స్పైసెస్ బోర్డు ప్రధాన కార్యాలయం నుండి నిధుల మంజూరు కొంత ఆలస్యం జరగవచ్చు అన్నారు. త్వరలో  రైతు శిక్షణ కార్యక్రమాలకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మరి కొన్ని కార్యక్రమాలకు నిధుల లభ్యత ఉన్నప్పటికీ  కోవిడ్ నిబంధనలు ప్రతిబంధకంగా ఉన్నాయన్నారు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు వీలైనంత త్వరగా రైతుల కోసం వివిధ శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు. అనంతరం సాంబశివ రెడ్డి రైతుల సమస్యలపై లేఖను స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి లింగప్ప కి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు సిబ్బంది సాగర్,  వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: