CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలి

Share it:

 



👉🏿సిఐటియు డిమాండ్...

మన్యంమీడియా,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురం(నరసాపురం) గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్,ఈ సమావేశంలో మాట్లాడుతూ కొవిడ్ 19(కరోనా) వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కూడా ప్రాణాలకు తెగించి, గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చెసిన కార్మికుల పట్ల, గతంలో  ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్రూరంగా వ్యవహరిస్తున్నారని. వచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా నెలలు తరబడి చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని, మెమో నెంబర్ 2026 ని తీసుకొచ్చి గ్రామపంచాయతీ కార్మికులతో ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదులను, టాయిలెట్స్ ను కడిగించే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస నెల వేతనం 19,500/- రూపాయలను ఇవ్వాలని, ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలని,  ఆదివారం కూడా వీక్లీ ఆఫ్ ఇవ్వకుండా మల్టీపర్పస్ విధానం పేరుతో కార్మికులతో నీళ్లు, ఎలక్ట్రిసిటీ ,పారిశుద్ధ్య నిర్వహణ, తదితర పనులు చేపిస్తూన్నారని, ఇలాంటి దుర్మార్గపు విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్ భరత్ , ఎం రామకృష్ణ , గోపాలకృష్ణ , కృష్ణ , తదితర కార్మికులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: