CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

తారక్ టీం ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు

Share it:

 


మన్యం టీవీ, ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి మండలం. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్ట్యా మండల ప్రజలుకు‌, ప్రయాణికులకు సౌకర్యార్థంగా మండలంలో ప్రధాన సెంట్రలైన ములకలపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.  తారక్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కట్టంస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని జగన్నాధపురం గ్రామంలో చలివేంద్ర కేంద్రాన్ని, ములకలపల్లి మండల మాజీ ఎంపీపీ కీసరి లక్ష్మణరావు ములకలపల్లి గ్రామంలో చలివేంద్ర కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు  తారక్  టీం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా చురుగ్గా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తారక టీం ట్రస్ట్ సభ్యులు పవన్, టోనీ ,రామకృష్ణ, కంటే నాగ శేషు ,కరీం ,హరికృష్ణ, కృష్ణా రావు, నరేష్, గోపి, రాకేష్, సత్య భాస్కర్ ,వంశీ ,వినయ్, దినేష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు తన్నీరు చిన్న పుల్లయ్య, తేళ్ళ చెన్నయ్య, ములకలపల్లి సర్పంచ్ బీబినేని భద్రం‌, జగన్నాధపురం ఉప సర్పంచ్ సున్నం బాలకృష్ణ ,స్థానికులు ,ఆటో యూనియన్ నాయకులు గిరి, జానీ, నాని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: