CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో బీజేపీదే విజయం

Share it:

 



తెరాస ప్రభుత్వ మోసాలను ఓటర్లకు గుర్తు చేయాలి


టీఆర్ఎస్ కారు షెడ్ కు పోవడం ఖాయం

 

-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి                                                                                                                                                                  


మన్యం టీవీ మంగపేట.


తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రెండు సీట్లలోనూ బీజేపీయే విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మంగపేటలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు ప్రాధాన్యత ఇస్తూ, అక్రమాలకు పాల్పడుతూ బంగారు తెలంగాణ పేరు చెపుతూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చిందని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచుకుని కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుంబ సభ్యులను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా నియమించుకున్నాడు కానీ తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక లక్ష పైగా ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్తున్న టీఆర్ఎస్ నాయకులు వాటిని ఎవరెవరికి ఇచ్చారో నిరూపించాలని సవాల్ విసిరారు. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గ్రాడ్యుయేట్లకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఏం చేశాడో చెప్పాలని, గెలిచిన తర్వాత ఏ ఒక్క పని చేయని పల్లా రాజేశ్వర్ రెడ్డి కి గ్రాడ్యుయేట్లకు వద్దకు వచ్చి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఎందుకు ఓటు వెయ్యాలో ఒక్క కారణం చూపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను నోట్ల కట్టలతో కొనాలని టీఆర్ఎస్ ప్రభుత్వం,లీడర్లు చూస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో వచ్చిన రిజల్టే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా వస్తుందని, ఎమ్మెల్సీ ఎలక్షన్ల అనంతరం టీఆర్ఎస్ పార్టీ కారుషెడ్ కు పోవడం ఖాయమని అన్నారు. తాము ప్రశ్నించే గొంతుక అంటూ కొంతమంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఓట్ల కోసం వస్తున్నారని కానీ కేసీఆర్ మెడలు వంచాలి అంటే వ్యక్తి సరిపోడని,అందుకు శక్తి కావాలని ఆ శక్తి కేవలం బీజెపికే ఉందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్ పార్టీకి,కేసీఆర్ కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మోసం చేయటం కొత్త కాదని,ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్బంగా మరోమారు మోసపూరిత వాగ్దానాలతో గ్రాడ్యేయేట్స్ ముందుకు వస్తుందని,మేధావులు, గ్రాడ్యుయేట్స్ ఆలోచించి టీఆర్ఎస్ ప్రభుత్వం,లీడర్లు చెప్పే మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు.ఈ మీటింగ్ లో బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కరరెడ్డి,బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా(పాముల పాషా),జిల్లా, మండల నాయకులు ఎర్రంగాని వీరెన్ కుమార్,గాజుల కృష్ణ, అల్లె జనార్ధన్,గద్దల రఘు, లోడె శ్రీనివాస్,రామగాని అనిల్, రావుల జానకిరావు, దంతనపెల్లి నరేందర్, ముత్తెబోయిన నర్సింహరావు, గూడబోయిన సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: