CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వ్యతిరేక చట్టాలపై కొనసాగుతున్న నిరసనలు

Share it:

 


       

మన్యంటీవీ,దమ్మపేట:

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని రైతులు గత వంద రోజులుగా పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం  రైతులపై అనేక తప్పుడు కేసులు పెట్టి రైతులను దేశద్రోహులుగా చిత్రిస్తూ ఉద్యమాన్ని ఆనించి వెయలనీ ప్రయత్నాలు చేసి విఫలమైంది, రైతులు అలుపెరగని పోరాటాలు చేసి నేటికి వంద రోజులు పూర్తి అయినది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటిపైన నల్ల జెండా ఎగురవేయాలని నిరసన తెలియజేయాలని  ఏఐకెసిసి ఈ పిలుపులో భాగంగా ఈ రోజున దమ్మపేట సిపిఐ కార్యాలయం వద్ద నల్ల జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు, అమర్లపూడి రాము, మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డ లక్ష్మీనారాయణ, గడ్డిపాటి సత్యం, నల్ల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. దమ్మపేట మల్లారం మోడల్ కాలనీ లో నల్ల ప్రసాదు, జాంబీ లక్ష్మీనారాయణ, జండా ఎగరవేశారు. ముద్దుల గూడెం లో ఎం శ్రీనివాసరావు దొడ్డ లక్ష్మీనారాయణ, లింగాల పల్లి లో ఊకే అప్పారావు, వాడే గిరి ముత్యాలరావు, పార్కులగండిలో కాకావెంకటేష్, కారం ప్రసాద్, శివ బజార్, గండుగులపల్లీ లో ఆదినారాయణ, మడి శ్రీను, కేసర్ వెంకటేశ్వరరావు, నల్ల జెండాలను ఎగరవేసి నిరసన తెలియజేసినారు.

Share it:

TELANGANA

Post A Comment: