CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళపై అత్యాచారం అమానుషం

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా విద్యార్థి విభాగం  అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ 

టి ఎన్ ఐ ఎం ఎస్ వ్యవస్థాపకులు జాడి నరసయ్య


మన్యం టీవి, కరకగూడెం: 

కరకగూడెం  మండలంలోని కరకగూడెం  గ్రామంలో    టి ఎన్ ఐ ఎం ఎస్  జిల్లా  వ్యవస్థాపకులు జాడి నరసయ్య, రాష్ట్ర నాయకులు దుర్గం రవీందర్, పోకూరి చిన్న రాజయ్య, జాడి నాగరాజు ,దుర్గం సంజీవ, ఆర్ మోహన్ రావు, ధనంజయ్  ,జిమ్మి డి ప్రకాష్,  మాట్లాడుతూ ఫిబ్రవరి నెల 27వ తారీకు  పినపాక మండలం లోనిఅత్తగారి ఇంటి నుండి కరకగూడెం మండలం లోని పుట్టింటికి బయలుదేరిన దళిత వివాహిత మహిళపై మధ్యాహ్నం  సమయంలో లో పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన నల్ల సాంబయ్య, నల్ల సృజన్ లు ఆటో నుండి  అడవిలోకి బలవంతంగా లాక్కెళ్లి అతి కిరాతకంగా హింసించి అత్యాచారం చేశారు .వారికి దిశ కేసులో నిందితులకు వేసిన  శిక్ష వేయాలని అన్నారు. అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డుమీద  తిరిగినప్పుడే స్వాతంత్రం  వచ్చింది అన్నారు పెద్దలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టపగలు అమ్మాయిలు  బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి చర్యలకు పాల్పడే దుండగులు కిరాతకుల కు చట్టపరంగా ఉన్నటువంటి శిక్షలు అన్ని అనుసరిస్తూ అంతకంటే కఠినంగా శిక్షించడం ఉరి వేయడం లేదా,

 ఎన్ కౌంటర్ చేస్తే గాని ఇకముందు దుశ్చర్యలకు పాల్పడే దుండగులు భయపడతారని తెలిపారు అదేవిధంగా అత్యాచారానికి గురైన దళిత మహిళకు 05 ఎకరాల భూమి, మహిళ కుటుంబంలో  ఒకరికి ఉద్యోగం, మరియు5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మండల నాయకులు జాడి శ్రీను, కొండ గొర్ల కోటేశ్వరరావు, జాడ వెంకటేశ్వర్లు, J. పూలమ్మ, దుర్గo లక్ష్మి, రామటీంకి నీలేష్, కావేరి సరస్వతి, జాడి రవి, జాడీ కన్నయ్య, చిట్టి బాబు, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: