CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిర్మల్ జిల్లా పోలీసులు, అప్పోలో మెడిస్కిల్ సవజాన్యంతో ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన.

Share it:


 మన్యం టీవీ కడెం :

నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ గారి ఆదేశాల మేరకు అప్పోలో మెడిస్కిల్ వారి సౌజన్యంతో కడం మండల కేంద్రంలోని హరిత రీసార్ట్ నందు నిర్వహించినారు, ఈ జాబ్ మేళాకు మారుమూల గ్రామాల్లోని నిరుపేద నిరుద్యోగ యువతి యువకులకు బారి సంఖ్యలో తరలివచ్చినారు

ఈ సందర్బంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ తల్లిదండ్రులపై ఆధారపడకుండా నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగంచేసుకొని జీవితంలో స్థిరపడాలని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోకుండా ఉపాధి అవకాశాలను వెతుక్కొని సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి అన్నారు. అందుకు ప్రైవేటు రంగంలో సైతం అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని పోలీసులు కూడా యువతకు ఉపాధి చూపేందుకు కృషి చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు  APOLLO MID SKILLS మరికొన్ని సంస్థలు  ముందుకు వచ్చాయని ఎస్పీ గారు తెలిపారు ఈ జాబ్ మేళా నందు అపోలో మెడ్ స్కిల్స్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ఇతర అధికారులు అభ్యర్థుల సర్టిఫి కేట్ ల వెరిఫికేషన్ అనంతరం సరైన ధ్రువపత్రాలు ఉన్నవారిని వివిధ కోర్సులకు ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ ఎంపీకైన అభ్యర్థులకు త్వరలో  హైదరాబాద్ లో గల  శిక్షణ కేంద్రంలలో శిక్షణ ఆరంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సిఐ శ్రీధర్, ఎస్.ఐ లు రాజు, రాహుల్, రాజేష్, జాబ్ మేళా నిర్వహణ సంస్థ సభ్యులు, యువతి, యువకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: