CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం.

Share it:

 


ఎక్కువ మెజారిటీ కొసమె మా ప్రచారం

మన్యం టివి: కరకగూడెం.ఖమ్మం నల్గొండ వరంగల్ 

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో  టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి  గెలుపు ఖాయమని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు.


 త్వరలోనే నిరుద్యోగులకు 3016 రూపాయలు  భృతి ఇవ్వబోతున్నట్లు తెలిపారు.


 తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ గారు 1 లక్షా 31 వేల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, 2లక్షల 60 వేల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్ దే. టి ఎస్ పి ఎస్ సి ద్వారా 35వేలు,  పోలీస్ శాఖలో 32వేలు, గురుకులాల ద్వారా 3,500, డి ఎస్ సి ద్వారా జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను 9,350, సింగరేణి ద్వారా 1,350 ఉద్యోగాలు, ఆర్టీసీ కి వెయ్యి కోట్లు ఇచ్చి 5,500 ఉద్యోగాలు ఇచ్ఛినం. ఆశా వర్కర్ల కు 1,500 నుంచి 6వేలకు, అంగన్ వాడి వర్కర్ల కు 4,000 నుంచి 7,000 లకు, 10 వేలకు, హామీ గార్డు లకు 9 వేల నుంచి 21వేలకు, జూనియర్ లెక్చరర్ల కు, డిగ్రీ, యూనివర్సిటీ లెక్చరర్ల కు కూడా జీతాలు పెంచిన ఘనత సీఎం కెసిఆర్ ది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు వేతనాలను పెంచాం. ఇలా అనేక ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న 3.24 లక్షల మంది రకరకాల ఉద్యోగులకు జీతాలు పెంచినామని  చెప్పారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూనే, ప్రైవేట్ విద్యను కాపాడుతున్నాడు  సీఎం కెసిఆర్ కాపాడుతున్నాడు అని అన్నారు


 మరో 50వేల నుండి 60 వేల ఉద్యోగాలు రానున్నాయి. అనేక అవకాశాలు రానున్నాయి. అవన్నీ త్వరలోనే నిరుద్యోగులకు అందనున్నాయి.


ఈ కార్యక్రమంలో  పినపాక నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్లు జి.వి రావు,.కరుణ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, బూర్గంపాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు,  పాయం నరసింహారావు, కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి,  విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎన్. రాజు, నియోజకవర్గ టిఆర్ఎస్వి  అధ్యక్షులు గుండ్ల రంజిత్ కుమార్, పినపాక మండలం టిఆర్ఎస్వి  మండల అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, టిఆర్ఎస్వి నాయకులు సాయిరాం యాదవ్, మామిళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు...

Share it:

TELANGANA

Post A Comment: