CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉నేటితో జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి.

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం

 జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు పేదల ముంగిటకు ప్రభుత్వ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో పని చేసారు. కుగ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని పరిష్కరించారు.   పరిపాలన సౌలభ్యంలో భాగంగా ప్రభుత్వం నూతన జిల్లాలో ఏర్పాటుతో ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 3 వ కలెక్టర్ గా డా ఎంవి రెడ్డి గత సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు.   కరోనా వ్యాధి కష్ట కాలంలో    నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టారు.  మారుమూల గ్రామలున్న మన జిల్లాలో వ్యాధి నియంత్రణకు విశేషంగా కృషి చేసారు. గ్రామ గ్రామానికి వ్యాధి నియంత్రణకు పాటించాల్సిన సమాచారం అందించే విదంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు చేశారు.  మారుమూల గుత్తికోయ  గ్రామాల్లో పర్యటించి వారితో మమేకమై సమస్యలు పరిష్కారం నకు చర్యలు చేపట్టారు.  కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలకు జాతీయ స్థాయిలో స్కోచ్ పురస్కారం అందుకున్నారు.  మొబైల్ టీమ్స్ ఏర్పాటుతో  గ్రామాల్లో వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.  హైదరాబాద్, వరంగల్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సెంట్రల్ ఆక్సినేషన్ ఏర్పాటు చేశారు.  అత్యవసర  కేంద్రాలు ఏర్పాటు చేశారు.  కరోనా, సీజనల్ వ్యాధులను దీటుగా ఎదుర్కొంటూనే గోదావరి వరదల నుండి  ప్రజల రక్షణకు చర్యలు చేపట్టారు.  ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టారు.  జిల్లాలో 67 వ్యవసాయ క్లస్టర్ లలో రైతు వేదికలు నిర్మించారు.  వేదిక నిర్మాణాలను ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.  1271 పల్లె ప్రకృతి వనాలు, 481 వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు నిర్మాణాలు చేపట్టి వ్యర్దాలు సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.   రహదారుల వెంబడి వ్యర్దాలు తొలగించి రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు 

నాటించారు. రానున్న హరితహారం కార్యక్రమానికి మొక్కల కొరత రాకుండా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచు కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారం మొక్కల పెంపకాన్ని ఇటీవల  ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు తో నిర్వహించిన సమావేశంలో అభినందించడం జరిగింది.  రైతు పొలాలకు వెళ్ళడానికి రహదారుల సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని గమనించి తక్షణం రహదారుల నిర్మాణం చేపట్టు విదంగా ఉపాధి హామీ పథకం నుండి నిధులు మంజూరు 

చేపించారు. జిల్లాలో ఈ సంవత్సర కాలంలో తనదైన. ముద్ర తో పరిపాలన సాగించి కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అని ప్రజల మన్ననలు పొందారు.

Share it:

TELANGANA

Post A Comment: