CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పోలియో చుక్కలు ప్రతి డోసు చాలా ముఖ్యం

Share it:


 👉జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి

మన్యం టీవీ కొత్తగూడెం

 ఆదివారం పాత కొత్తగూడెంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు పోలియో మహమ్మారి వ్యాధికి గురికాకుండా రక్షించేందుకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. జిల్లాలో 98, 666 మంది చిన్నారులన్నట్లు గుర్తించామని చెప్పారు. పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహణకు వైద్య సిబ్బంది 1368 మంది అంగన్ వాడీ సిబ్బంది 769 మంది, ఆశా కార్యకర్తలు 1449 మంది ఇతరులు 405 మొత్తం 3991 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ రోజు తదుపరి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు నియమించిన సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహణలో సర్వే నిర్వహించినట్లు ఇంటికి మార్కు సూచించాలని చెప్పారు. జిల్లాలో నూటికి నూరు శాతం ఏ ఒక్క చిన్నారిని వదల కుండా పోలియో చుక్కలు వేయాలని ఆయన తెలిపారు. పోలియో చుక్కలు వేసిన చిన్నారులకు సిరా గుర్తు పెట్టాలని ఆయన సూచించారు. ప్రజా ప్రతినిధులు గ్రామ స్థాయిలో తల్లిదండ్రులకు పోలియో చుక్కలు వల్ల కలిగే ప్రయోజనాలను తెలియచేయడంతో పాటు చిన్నారులకు పోలియో చుక్కలు అందచేయు విధంగా వైద్య సిబ్ధాందికి సహకరించాలని చెప్పారు. హై రిస్స్ ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ముఖ్యంగా ఇటుక బట్టీలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లులో పోలియో చుక్కలు వేసేందుకు టీములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొబైల్ టీములు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భాస్కర్, పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, ఉప వైద్యాధికారి డాక్టర్ వినోద్, డాక్టర్ చేతన్, డాక్టర్ నిసి మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, పొన్నెకంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: