CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాడివేడిగా సర్వసభ్య సమావేశం అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవడంతో ఆగ్రహించిన జడ్పిటిసి కొడకండ్ల వెంకట్ రెడ్డి.

Share it:

 



చండ్రుగొండ మన్యంటీవీ : చండ్రుగొండ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు ఎంపీపీ బానోత్ పార్వతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది ఈ సమావేశంలో పలువురు మండల ప్రజా ప్రతినిధులు అడిగిన సమాధానాలకు అధికారుల వద్ద సరైన సమాచారం లేక పోవడం ఎంతో జెడ్పిటిసి కొడకండ్ల వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో ఎంపీపీ బానోత్ పార్వతి జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్ కలగజేసుకుని సర్పంచులు ఎంపిటిసి లకు అవకాశం ఇవ్వాలని పదేపదే మీరే మాట్లాడితే వారి సమస్యలు ఎలా వస్తాయని అన్నారు. సమస్య వాళ్లు అడగక పోవడంతోనే నేను అడుగుతున్నానని. జడ్పిటిసి అన్నారు. దీంతో వారి  మధ్య స్వల్ప వాగ్వివాదం ఏర్పడింది. దీంతో జెడ్పిటిసి కొడకండ్ల వెంకట్ రెడ్డి,  ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సభలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సభ నుంచి కిందకు దిగి కూర్చున్నారు ఎంపీడీవో అన్నపూర్ణ పైకి రావాలని పిలిచినా కూడా  ఆయన వినలేదు దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ దారా బాబు, జడ్పిటిసి మాట్లాడుతూ.. పేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా వారి ఆధీనంలో ఉన్న భూముల్లో గుడిసెలు ఏర్పరచుకున్నారని. వాటిని ఏజెన్సీ చట్టం పేరు చెప్పి  పేద వారి నోటి కాడ కూడు గూడు తీయవద్దని సభా పరంగా కోరారు. పేదవాళ్లు కాకుండా ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ప్రవేశించి వ్యాపార సముదాయాలు బహుళ అంతస్తులు నిర్మిస్తే  మేము కూడా వ్యతిరేకిస్తామని. అవసరమైతే వాటిని మేము కూడా అడ్డుకుంటామని. కానీ పేదవాడి గుడిసెలను ఇళ్లను తొలగించవద్దు అని సభా పరంగా కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వీరభద్ర నాయక్, సిడిపివో  నిర్మల జ్యోతి, మండల వైద్యాధికారి డాక్టర్ గీత, మండల పంచాయతీ అధికారి తోట తులసీరామ్, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, ఎంపీటీసీలు సర్పంచులు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: