CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు కోసం పోరు బాట పడుతున్న ఆదివాసీ గిరిజనులు...

Share it:

 


ఆదివాసీ గిరిజన పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్...



మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల హెడ్ క్వార్టర్ లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదివాసి గిరిజన పోడు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సదస్సు లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు మాట్లాడుతూ.. ఎలక్షన్స్ కి ముందు పోడు రైతులకు పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు హరితహారం పేరుతో టి ఆదివాసీ గిరిజనుల పోడు భూములను లాక్కోవాలని చూస్తున్నారని అన్నారు. ఆదివాసి గిరిజన పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తు.. దాడులు చేస్తున్నారని, ఇక పై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.  ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి హక్కులను చట్టాలను కాలరాస్తున్నారని అన్నారు. అడవినే నమ్ముకుని అటవీ సంపదనే జీవనాధారంగా చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం గడుపుతున్న ఆదివాసీ గిరిజనులను అడవి నుంచి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. లేనిపక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి రాబోవు రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వెంటనే మండలంలోని ఆదివాసీ గిరిజన పోడు రైతులందరికీ పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ పార్టీ మండల కార్యదర్శి  ఎదులాపురం గోపాలరావు, గిరిజన ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర నాయకులు ఆరెం రామయ్య, పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి  విప్లవ కుమార్, ఓ పి డి ఆర్ జిల్లా నాయకులు బచ్చల లక్ష్మయ్య, షేక్ ఉమర్ మియా, వి రమేష్, మండల పరిధిలోని ఎలుక లోడ్డు, రాంపురం, సూరారం, నల్లబండ బోడు, గ్రామాల ఆదివాసీ గిరిజన పోడు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: