CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజ్యం కోల్పోయిన ఆదివాసి రాజు లారా మేల్కోండి

Share it:

 


👉ప్రమాదంలో ఆదివాసీ జాతి ఉనికి

👉ఆలోచన పండుగలు నిర్వహించాలి

👉రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టి జాతి ఉనికి కోసం పోరాటం చేస్తున్న  విప్ రేగా కాంతారావు ఆదర్శనీయులు

👉ఉన్నత విద్య, కొలువులో  ఆదివాసీ బిడ్డలు  వెనుకబాటు

👉ఆదివాసీ యువత గూడాలలో కాదు...రోడ్లెక్కండి

👉ఓయూ ప్రొఫెసర్ రామయ్య

మన్యం టీవీ, పినపాక:

రాజ్యం కోల్పోయిన ఆదివాసి రాజు లారా .... సుఖం తెలవని  కష్టజీవి లారా ....మేల్కోండి ..ఆదివాసీ జాతి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అంటూ ఆవేదనతో ప్రొఫెసర్ రామయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం మిని గురుకులం లో ఏర్పాటుచేసిన ఆదివాసి హక్కులు, చట్టాలు, సంస్కృతి సాంప్రదాయాలు అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు.ఆదివాసీ తేగలపై విస్తృత పరిశోధనలు చేసిన ఆయన పాలకుల నిర్ణయాలతో వారి ఉనికి ప్రమాదంలో  ఉందన్నారు.పచ్చని అడవుల్లో ప్రశాంత వాతావరణం లో సాగిన వారి బతుకులు ప్రపంచీకరణ లో ప్రమాద స్థాయి కి చేరుకున్నాయి అని ఆవేదన వెలిబుచ్చారు.చరిత్ర తెలియనియాడు చరిత్ర ను నడి పించలేరని...ఆదివాసీ యువత వారి చరిత్రను తెలుసు కోవాలాన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాలు కావస్తున్నా ఆదివాసి జాతి అన్ని రంగాలలో వెనుక బాటు తనానికి గురికావడం బాధాకరమన్నారు. తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అని తన జాతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఆదివాసి జాతి కోసం ఐలాపురం నుండి పోరాటానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఆదివాసి యువత ప్రజా ప్రతినిధులు ఉద్యోగ సంఘాలు మేలుకో వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిష్ఠాత్మక విద్యాలయాలలో ఆదివాసి విద్యార్థులు నేటికీ కనిపించకపోవడం వారి వెనుకబాటు తనానికి నిదర్శనమన్నారు. ఆదివాసి యువత రోడ్డు ఎక్కాలని ఆయన పిలుపునిచ్చారు .అప్పుడే ఇతర వర్గాలతో పోటీ పడి చైతన్య వంతులు అవుతారని ఆయన సూచించారు.గ్రామగ్రామాన ఆలోచన పండుగ నిర్వహించాలి ఆయన పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: