CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులకు దిక్సూచి రైతు వేదికలు

Share it:

 


👉ప్రపంచంలో రైతులకు వేదికలు కట్టించిన ఘనత సీఎం కేసీఆర్ దే

👉దేశంలో60శాతం వరి ధాన్యం తెలంగాణ రాష్ట్రం నుండే

👉పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసింది

👉ఎరువుల కొరత లేదు

👉విద్యుత్ కోతలు లేవు

👉రైతు బంధు తో రైతు ఆర్ధిక స్థిరత్వం

👉రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

👉జానంపేట, ఏడుల్లా బయ్యరం లో రైతు వేదికలు ప్రారంభించిన విప్ రేగా కాంతారావు

మన్యం టీవీ,పినపాక:రైతులకు దిక్సూచి రైతు వేదికలు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు అన్నారు.ఆయన గురువారం పినపాక మండలం జానంపేట,ఏడూళ్ళ బయ్యరం గ్రామాల్లో 44లక్షల పై చిలుకు వ్యయం తో ఏర్పాటు చేసిన రైతు వేదుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు ఆయా వేదుకల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశాల్లో మాట్లాడారు.ప్రపంచంలో రైతులకు వేదికలు కట్టించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.దేశంలో పండించిన వరి లో60శాతం వరి ధాన్యం తెలంగాణ రాష్ట్రం నుండే ఉత్పత్తి అవ్వడం సీఎం కేసిఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ కు నిదర్శనం అన్నారు.రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.తెలంగాణ రాష్ట్రం లో రైతు లకుఎరువుల కొరత లేదు,విద్యుత్ కోతలు లేవు అని అన్నారు.రైతు బంధు తో రైతు ఆర్ధిక స్థిరత్వం సాధించి అప్పుల ఊబి నుండి బయట పడ్డారన్నారు.

పినపాక నియోజకవర్గాన్ని  గజ్వేల్ లా అభివృద్ధి చేస్తా

పినపాక నియోజకవర్గాన్ని మరో గజ్వేల్ గా మారుస్తా అని విప్,పినపాక శాశన  సభ్యులు రేగా కాంతారావు అన్నారు.ఇప్పటికే పినపాక అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అని ,మరో 5 సంవత్సరాలలో పినపాక రూపురేఖలు మారుతాయన్నారు.

విప్ రేగా కు ఘన స్వాగతం

రైతు వేదుకల ప్రారంభానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు కి ఘన స్వాగతం పలికారు. వందలాది మంది రైతులు ,కార్యకర్తలు రేగా తో అడుగులు వేశారు. జానంపేట లో రైతు వేదిక ప్రారంభోత్సవానికి ఆత్మ మణుగూరు డివిజన్ అద్యక్షులు పోనుగోటి భద్రయ్య, పీఏసీఎస్ మండల అధ్యక్షులుడా. రవిశేఖర వర్మ, జానంపేట సర్పంచ్ బడిశా మహేష్, ఎంపీటీసీ లు కాయం శేఖర్,పొలిశెట్టి మహేష్ ,జానంపేట ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ ,పాయం కామేశ్వరరావు,గుండాల లక్ష్మయ్య, వీరయ్య,గుడం దామోదర్,సూరినేని ధర్మారావు,ఏడుల్లా బయ్యారంలో టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీశ్ రెడ్డి, పిఎసిఎస్ఉపాధ్యక్షులు బత్తుల  వెంకటరెడ్డి ,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస రెడ్డి లు ఘన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో  భుర్గంపాహాడ్ మార్కెట్ కమీటీ అధ్యక్షురాలు పొడెం ముత్యాలమ్మ,ఎంపీపీ గుమ్మడి గాంధీ,వైస్ ఎంపీపీ కంది సుబ్బా రెడ్డి,ఎంపీటీసీ ల సంఘ5 మండల అధ్యక్షులు చింతపండు సత్యం,ఎంపీటీసీ దొడ్డ తిరుపతమ్మ,సర్పంచ్ రజని, కోఆప్షన సభ్యులు ఎస్కే జహంగీర్, టీఆరెస్ పార్టీ నాయకులు దాట్ల వాసు బాబు,కొండేరు  రాము,డాక్టర్ శ్రీ రామ్ , వారానరసింహారావు  , 

 పొలిశెట్టి సత్తిబాబు,

 యువజన విభాగం మండల అధ్యక్షులు కేపా సతీశ్ ఎంపీటీసీ లు,సర్పంచులు వివిధ శాఖల అధికారులు 

 పంచాయరాజ్ ఈ ఈ భూక్య మంగ్యా నాయక్ ,తహసీల్దార్ ఉమామహేశ్వరరావు,ఎంపీడీవో శ్రీవాసులు ,పీఆర్ ఏ ఈ వగలగాని వెంకట్ ,ఏడుల్లా బయ్యారం సీఐ దోమల రమేష్ ,ఏవో వెంకటేశ్వర్లులు, పాల్గొనగా.. ఏడీ ఈ తాతారావు కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు.

Share it:

TELANGANA

Post A Comment: