CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగన్వాడీ టీచర్,ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.

Share it:

 


మన్యంటీవీ ఏటూరునాగారం:


 ములుగు జిల్లా ఏటూరునాగారం ఐ సి డి ఎస్ పరిధిలోని  ఏటూర్ నాగారం, కన్నాయిగూడెం మండలాలలో ఖాళీగా ఉన్న  అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయా పోస్టులకు  ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్స్,  ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని ఏటూరునాగారం సి డి పి ఓ హేమలత తెలిపారు. అందులో భాగంగా అంగన్వాడీ ఆయా, పోస్టులు, మొత్తం రెండు అంగన్వాడీ టీచర్ లు, ఏడు అంగన్వాడీ ఆయా పోస్టుల వివరాలు:( 1) ఏటూరునాగారం మండలం  రొయ్యూరు  గ్రామపంచాయతీ  రొయ్యూరు అంగన్వాడి కేంద్రం- 3 ను   ఎస్సీ రిజర్వుడ్  అంగన్వాడి టీచర్, (2) కన్నాయిగూడెం మండలం  దేవాదుల  అంగన్వాడి కేంద్రం  ఎస్సీ  రోస్టర్ పాయింట్-2  అంగన్వాడి టీచర్,( 3) ఏటూరునాగారం మండలం  బ్యాంకు కాలనీ బిసి- ఏ రోస్టర్ పాయింట్స్- 4 అంగన్వాడీ ఆయా, (4) ఏటూరునాగారం మండలం  కోయగూడెం ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పప్కాపూర్ గ్రామం అంగన్వాడి కేంద్రం  రోస్టర్ పాయింట్స్-6 విహెచ్  అంగన్వాడీ ఆయా, ఏటూరునాగారం మండలం  కోయగూడెం ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో  రామ్ నగర్ ఎస్సీ  రోస్టర్ పాయింట్స్- 7 అంగన్వాడీ ఆయా, కన్నాయిగూడెం మండలం గుర్రేవుల-1 జనరల్ ఓసి రోస్టర్ పాయింట్స్-5 అంగన్వాడీ ఆయా, కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి-1 జనరల్ ఓసి రోస్టర్ పాయింట్స్-3 అంగన్వాడీ ఆయా, కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం-1 ఎస్సీ రిజర్వుడ్ అంగన్వాడీ ఆయా, కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం-2 ఎస్సీ రిజర్వుడ్ అంగన్వాడి ఆయా, ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హేమలత తెలిపారు.18--35 సంవత్సరాలు నిండిన,   ఆసక్తి గలవారు అర్హతలు తప్పనిసరిగా పదవ తరగతి (టెన్త్) పాస్ అయి ఉండాలి. వివాహితురాలై ఉండాలి. స్థానిక గ్రామ పంచాయితీ లో నివాసం ఉండాలి.  జతచేయాల్సిన సర్టిఫికెట్ లు  భర్త్, పుట్టిన తేది/వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ(క్యాస్ట్)పత్రం,విద్యార్హత ధృవీకరణ పత్రం, అంగవైకల్యం అయితే వైద్యాధికారి ధృవీకరణ(సదరం), వితంతువు అయితే భర్త ధృవీకరణ పత్రం,  అనాధ అయితే అనాధ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని తెలిపారు.   ఖాళీలు మరియు అర్హత సంబంధించిన వివరాల కోసం https://mis.tgwdcw.in వెబ్ సైట్ ను సంప్రదించాలని పేర్కొన్నారు. తేది 04-01-2021 నుండి 15-01-2022 వరకు అర్హులైన అభ్యర్థిని లు ఆన్లైన్ చేసుకోగలరని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: