CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉద్వేగాలు పెంచి, విద్వేషాలు రెచ్చ‌గొట్టి...జిహెచ్ఎంసిలో ల‌బ్ధి పొందిన బిజెపి, ఎంఐఎంలు -మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

Share it:


వ‌రంగ‌ల్, డిసెంబ‌ర్ 05ః

జిహెచ్ ఎంసి ఎన్నిక‌ల్లో బిజెపి, ఎంఐఎంలు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉద్వేగాలు పెంచి, విద్వేషాలు రెచ్చ‌గొట్టి, రాజ‌కీయ ల‌బ్ధి పొందా‌య‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో 30 కోట్లతో సమకూర్చిన స్వీపింగ్ మిషన్లు, కంప ట్రాక్టర్లు, షీ మొబైల్ టాయిలెట్స్ బస్సులను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... కొద్దిసేపు మీడియాతో మ‌ట్లాడారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ,  అన్ని కుట్ర‌లు, కుతంత్రాల‌ను ఛేదించుకుని, ప్ర‌జ‌లు టిఆర్ఎస్ ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిపించార‌ని ఆయ‌న అన్నారు. టిఆర్ఎస్ పార్టీ, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల నాయ‌క‌త్వ ప‌టిమ‌పై న‌మ్మ‌కం ఉంచిన‌ ప్ర‌జ‌ల‌కు మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే ఎవ‌రితోనూ పొత్తు లేకుండానే  జిహెచ్ఎంసి మేయ‌ర్ ని ద‌క్కించుకుంటామ‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. అనేక చోట్ల అతి త‌క్కువ ఓట్ల‌కే ఓడిపోయామ‌ని చెప్పారు. అయితే, ఓట‌మికి గ‌ల కార‌ణాలను పార్టీలో స‌మీక్ష చేసుకుంటామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ త‌ర‌హాలోనే వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రాన్ని అనేక విధాలుగా అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నికల్లో బిజెపి నేత‌లు ఏం చేశార‌ని, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడ‌గ‌డానికి వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు.

Share it:

TELANGANA

Post A Comment: