CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్వసభ్య సమావేశంలో "జూలూరుపాడు లో ప్రత్యేక మార్కెట్ "ఏర్పాటు చేయాలని సభ్యుల ఏకగ్రీవ తీర్మానం..

Share it:

 


మండలంలో కొన్ని అంగన్వాడీ కేంద్రాల పనితీరు పై ప్రజాప్రతినిధుల అసంతృప్తి...


మన్యం టీవీ : జూలూరుపాడు

బుధవారం మండల పరిషత్తు కార్యాలయము నందు  ఎంపీపీ లావుడ్యా సోనీ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు ప్రగతి నివేదిక లు చదివి వినిపించారు గ్రామాలలో కొన్ని అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నించారు. జూలూరుపాడు మండలం లో ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని హాజరైన సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మండలంలో వివిధ గ్రామ పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఎంపీపీ లావుడ్యా సోనీ అడిగి తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కళావతి, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ రామారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: