CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని జడ్పీ హై స్కూల్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ బట్టలు పంపిణీ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై బట్టలను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరు కూడా నిరాశ చెందకుండా వారివారి పండుగలను ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ పేద క్రైస్తవులకు క్రిస్టమస్ కానుకలు క్రిస్టమస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం అభినందనీయమని అన్నారు.అలాగే రాష్ట్రంలో లో ఏ పండుగ వచ్చినా దసరాకి హిందువులకు, రంజాన్ కి ముస్లింలకి, క్రిస్టమస్ పండుగకు క్రిస్టియన్ లకు కూడా నూతన కానుకలు అందిస్తున్నారని,బంగారు తెలంగాణ దిశగా బాటలు వేస్తున్నారని.ఎంతో ముందు చూపు ఉన్న మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు.అందుకే చర్చి లో పాస్టర్లు అందరూ కూడా మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి మన ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మీరు కూడా ప్రార్థనలు చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి,పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ,ఏడు మండలాల ఎంపీపీ లు,ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,మణుగూరు తహసీల్దార్ రుధర్ విల్సన్, పిఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్, పోనుగోటి భద్రయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు, దొబ్బల వెంకటప్పయ్య, డైరెక్టర్ సకిని బాబురావు, వైస్ ఎంపీపీ కె వి రావు, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీలు, కణితి బాబురావు,మచ్చ సమ్మక్క,సరిత,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్, సర్పంచ్ లు,బచ్చల భారతి, కొమరం జంపేశ్వరి,బొగ్గం రజిత,ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, టిఆర్ఎస్ నాయకులు, వట్టం రాంబాబు,తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ముద్దంగుల కృష్ణ, తంత్రపల్లి కృష్ణ, నాగేశ్వరరావు,ఉప్పుతల రామారావు,ఎడ్ల శ్రీను, వెంకట్ రెడ్డి,నియజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, మండల టౌన్ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, హర్షవర్ధన్,అశోక్ గౌడ్, జక్కం రంజిత్,పద్ధం శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జి సిరికొండ శ్యామ్ సుందర్,బొశెట్టి రవి ప్రసాద్, గుర్రం సృజన్,గాండ్ల సురేష్, మేకల రవి, రామకోటి, సురేందర్ పటేల్,చర్చి ఫాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు, మహిళలు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: