CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి

Share it:

 



లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి

*డిసెంబర్ 9న మణుగూరు ఆదివాసి ర్యాలీ,సభని విజయవంతం చేయండి *తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలెం కోటి

మన్యం టివి,పినపాక: లంబాడి సామాజికవర్గాన్ని ఎస్టి జాబిత  నుండి తొలగించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆలెం కోటి డిమాండ్ చేశారు .ఆయన బుధవారం పినపాక మండలం మల్లారం గ్రామంలో తుడుండెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మడకం సత్యలింగం అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో అలెం కోటి మాట్లాడారు .ఈ నెల 9న మణుగూరు పట్టణంలో నిర్వహించతలపెట్టిన ఆదివాసీ ర్యాలీ, సదస్సులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.మల్లారం,తిర్ల.పురం గ్రామాలకు చెందిన ఆదివాసులకు సంబంధించిన పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  కొమరం శీను, సుతారి వెంకన్న ,చుక్కయ్య ,రవి, ప్రసాద్, రామయ్య, శ్రీను, సత్యం, పునెం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: