CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఒడిశా సర్కార్ ఆదివాసీల సంస్కృతిని నాశనం చేయాలనీ చూస్తోంది...

Share it:



  • ఒడిశా సర్కార్ ఆదివాసీల సంస్కృతిని నాశనం చేయాలనీ  చూస్తోంది...                              
  • నియామ్ గిరి పర్యాటక ప్రాజెక్ట్ ని నిలుపుదల చేయాలి...

నూగూరు వెంకటాపురం అక్టోబర్12(మన్యం న్యూస్)

కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ఆదివాసీల  సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేయాలని చూస్తున్నాయని ఆదివాసీ నవనిర్మాణ సేన మండల  అధ్యక్షులు పోలేబోయిన భార్గవ్ ఆరోపించారు. సోమవారం  ఆ సంఘ మండల కమిటీ సమావేశం  మండల ఉపాధ్యక్షులు శరత్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా  భార్గవ్ మాట్లాడుతూ ఈరోజు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను  వినోద  వస్తువులుగా ,ఓట్లు ఉత్పత్తి చేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాయని  ఆయన దుయ్యబట్టి నారు. ఆదివాసీలు తాము వినోదం కోసమేనా? ఇంకెన్నాళ్లు  అభివృద్ధి పేరుతో  మా పైన,మా  మస్కృతి సంప్రదాయాల పైన దాడులు చేస్తారని ఒడిశా లోని నియామ్ గిరి గిరిజనులు గవర్నమెంట్  మీద  తిరుగుబాటు చేస్తున్నా ఒడిశా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఒడిశా ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నియామ్ గిరి ఆదివాసీల బతుకులతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామ్ గిరి ఆదివాసీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించి శతాబ్దాలుగా తమ సంప్రదాయాలను ,ఆ కొండల్లో దాగి ఉన్న దైవాలాను అభివృద్ధి పేరుతో అంతం చేయాలనే  చూడటం దుర్మార్గం అన్నారు.ఎకో టూరిజం పేరుతో  నియామ్ గిరి ప్రాంతంలో ఉన్న గిరిజనుల భూముల్ని ప్రయివేటీ కరణ చేసి ఆదివాసీల భూములను లాక్కోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని  భార్గవ్ తీవ్రంగా ఆరోపించారు.ఈ ఎకో ప్రాజెక్ట్ కుర్లి గ్రామపంచాయతీ లోని అరిషకనిలో ఉందన్నారు.ఈ పంచాయతీ లోని 27 ఆదివాసీ గ్రామాల కోంధ్, డోంగ్రియా తెగలు ఎంతో కాలంగా ఈ పర్యాటక ప్రాజెక్ట్ ని నిలుపుదల చేయాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆయన అన్నారు.ఈ దేశంలో ఏ మూలన అభివృద్ధి పనులు చేపట్టిన  ఆ అభివృద్ధిలో సమిధలుగా  సమాధులుగా మారేది ఆదివాసీలే అన్నారు. తమ వ్యవసాయ భూముల్లో ఎకో టూరిజం కుటీర పరిశ్రమలు నిర్మించటానికి తాము అనుమతించ బోమని ఆదివాసీలు నిరసనలు తెలుపుతున్నారని అన్నారు.ఈ ప్రాంతంలో ఐదు గ్రామపంచాయతీ ల పెసా గ్రామసభల అనుమతి లేకుండా ప్రాజెక్ట్ లు పనులు చేపట్టడం అన్యాయం అన్నారు.ఇక్కడి భూమిని గిరిజనుల్లోని వివిధ తెగల మధ్య విభజించారని ,ప్రాజెక్ట్ ప్రతిపాదిత స్థలం పుషిక వంశం కిందకి వస్తుందని ఆయన వివరించారు.ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఆదివాసీలు తమ స్వేచ్చా జీవితాన్ని కోల్పోవటంమే కాక అటవీ ఉత్పత్తులను  సేకరించే క్రమంలో వారి మీద అటవీ శాఖల ఆంక్షలు పెరిగి దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు. ఒడిశా ప్రభుత్వం నియామ్ గిరి ఆదివాసీల కు నష్టం చేకూర్చే ఈ సామ్రాజ్యవాద ఉనికిని పెంచి పోషించే అభివృద్ధిని ఈ దేశంలో ఉన్న 40 కోట్ల మంది అడవి బిడ్డలు వ్యతిరేఖించకపోతే  అమెరికాలోని రెడ్ ఇండియన్స్ ఆ ఆదిమ తెగ అంతం లేని ఈ దేశంలోని ఆదిమ తెగలు కూడా మ్యూజియం లోని వస్తువులుగా మారే ప్రమాదం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో నవ నిర్మాణ సేన సైనికులు కొడేం వీనిత్ ,చెరుకూరి అజయ్ ,రవి,సురేష్,పాయం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: